గాయపడిన విద్యార్థులకు వైద్యం చేయిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో పెచ్చులూడిన భవనం
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : మద్దిలపాలెంలోని ఎస్‌విఎల్‌టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు పడి ఒకటవ తరగతి గదిలో ఉన్న పరినిధి, ధనుంజయ దీపక్, భవదీప్ విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిఎ ఎఎంజి ఆసుపత్రికి తరలించారు. శిథిలావస్థ భవనంలో తరగతులు నిర్వహించడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తల్లిదరడ్రులు భావిస్తున్నారు. విద్యార్థుల రక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై స్థానికులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










