Aug 08,2022 22:51

పనులను ప్రారంభిస్తున్న విఎంఆర్‌డిఎ చైర్మన్‌ అక్కరమాని

ప్రజాశక్తి - ఆరిలోవ : మన బడి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు ఇందిరానగర్‌లోని మండల ప్రజా పరిషత్‌ పాఠశాలలో మరమ్మత్తు పనులను ఎపి ఎడ్యుకేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పతివాడ వెంకటలక్ష్మి ఆధ్వర్యాన విఎంఆర్‌డిఎ చైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి ఇన్‌ఛార్జి జగ్గుపిల్ల అప్పలరాజు, అధ్యక్షులు పతివాడ కనకరాజు, ఎఇ నాగ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.