Aug 23,2023 22:00

హెచ్‌ఎంకు విరాళం అందజేస్తున్న గుండుమల తిప్పేస్వామి

ప్రజాశక్తి మడకశిర : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి తాను చదివినఉన్నత పాఠశాలకు చేయూతను అందించారు. గుడిబండ మండలం మందలపల్లి ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి తన వంతుగా రూ 50వేలను బుధవారం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మందలపల్లి ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసినట్లు చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తనవంతుగా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో రూ 50వేల మొత్తాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్‌ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప, రొళ్ల దాసిరెడ్డి, ఈరన్న, రామకృష్ణ, మందలపల్లి సర్పంచి సన్నమారప్ప, నియోజకవర్గ బీసీ సెల్‌ కార్యదర్శి పురుషోత్తం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.