Jan 05,2023 22:42

ప్రజాశక్తి - భీమడోలు
                 పొలసానిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో విద్యావ్యాప్తికి ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు అందిస్తున్న సహాయ సహకారాలకు సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపిపి ప్రాథమిక పాఠశాల నెంబర్‌-1లో రూ.29 లక్షలు నాడు నేడు నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని ఇతర పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు నిధులను ఎంఎల్‌ఎ మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పాఠశాల భవనాల మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.16 లక్షలు ఎంఎల్‌ఎ మంజూరు చేశారన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు అదనపు తరగతి గది ఆవశ్యకతను గుర్తించి, నిర్మాణానికి నిధులు మంజూరు కోసం ఎంఎల్‌ఎకు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన ఎంఎల్‌ఎ తరగతి గదుల నిర్మాణానికి రూ.13 లక్షల నాడు- నేడు నిధులు అదనంగా మంజూరు చేశారన్నారు. వీటితో నిర్ణీత కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సర్పంచి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధా ్యయులు కె.తులసి శ్రీనివాసరావు, గ్రామ పరిధిలోని ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మోహన్‌రావు, బాలభాస ్కర్‌తో పాటు వైసిపి ఉంగుటూరు నియోజకవర్గ మైనార్టీ సెల్‌ నాయకులు, పారిశ్రామికవేత్త షేక్‌ హసేన, వైసిపి ప్రముఖులు సిహెచ్‌.మధు, అంబటి నాగేంద్ర ప్రసాద్‌, పంచాయతీ పాలకమండలి సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.