శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కెల్ల సునీత, వెంకటలక్ష్మి
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డు పరిధి పైనాపిల్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు ఆదివారం వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, ఎపి ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ పతివాడ వెంకటలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు ఇన్‌ఛార్జి కెల్ల సత్యనారాయణ, వెంకటరెడ్డి, దుర్గారావు, పిల్లి వీర్రాజు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.










