Jul 14,2023 21:30

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

ప్రజాశక్తి - వినుకొండ : పాఠశాలు చెప్పకపోగా తమను వేధిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు బాబు రావు, ఇగ్లీషు ఉపాధ్యాయుడు లింకన్‌ను విధుల నుండి తొలగించాలని పట్టణంలోని ఎన్‌ఆర్‌టి రోడ్డులో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులం విద్యార్థులు డిమాండ్‌ చేశారు. వారిని కొనసాగించే ట్టయితే తమకు టీసీలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఎదుట ఆవేదనను వెళ్లగక్కారు. ఈ పాఠశాలపై కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గురుకులాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులను ప్రిన్సిపల్‌ ఛాంబర్‌కు పిలిపించి వారితో మాట్లాడారు. తెలుగు, ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులిద్దరూ మిగతా ఉపాధ్యాయులతో నిత్యం ఘర్షణలకు దిగుతారని, పాఠాలు సరిగా చెప్పడం లేదని అన్నారు. వారు చెప్పే పాఠశాలు అర్థం కావడం లేదని అడుగుతుంటే గైడ్‌లు కొనుక్కోవాలంటూ కోప్పడుతున్నారని, తల్లిదండ్రులను పిలిపించి కూడా గైడ్లు కొనాలంటున్నారని వివరించారు. పైగా పదో తరగతి పరీక్షలు ఓపెన్‌ యూనివ ర్సిటీలో రాసుకోవాలంటూ సలహాలి స్తున్నారని, ఇవ్వన్నీ చేసేట్టయితే ఉపాధ్యాయులుగా వారెందుకు, వారికి జీతాలు ఇవ్వడం ఎందుకూ? అని ప్రశ్నించారు. పాఠశాలలో విచారణ కోసం కొద్దిరోజుల కిందట వచ్చిన అధికారికి తాము ఫిర్యాదు చేశామని, అప్పటి నుండి ఉపాధ్యాయులిద్దరూ తమను వేధిస్తున్నారని వాపోయారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడు లింకన్‌ ఏదో రాసుకొ చ్చాడని, బెదిరించి తమ సంతకాలను తీసుకెళ్లారని, అందులో ఏముందో తమకు తెలియదని అన్నారు. గత మార్చిలో జరిగిన 9వ తరగతి పరీక్ష తెలుగు పేపర్లను ఉపాధ్యాయుడు బాబురావు 6వ తరగతి పిల్లలతో దిద్దించడమూ విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఘర్షణలకు దారి తీసిందని వెల్లడించారు. వీటన్నింటినీ విన్న ఎమ్మెల్యే స్పందిస్తూ ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ను నిలదీశారు. తనకేమీ తెలీదనే ప్రిన్సిపాల్‌ సమాధానంపై మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను పిలిపిం చాలని కోరగా ఇంటికి వెళ్లారని ఒకసారి, ఆస్పత్రికి వెళ్లారని మరోసారి ప్రిన్సిపాల్‌ చెప్పారు. దీంతో కలెక్టర్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించిన ఎమ్మెల్యే విషయాన్ని వివరిం చారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరా రు. ఎమ్మెల్యే వెంట న్యాయవాది ప్రసాద్‌, వైసిపి నాయకులు రామిరెడ్డి పాల్గొన్నారు.