Nov 08,2023 21:35

ఫొటో : ఆర్‌డిఒకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు

పాతస్టాంపు అమ్మకాలు ఆపడం అన్యాయం
ప్రజాశక్తి-కావలి : ప్రభుత్వం ప్రవేశపెట్టి ఉన్న ''ఈ-స్టాంపు'' విధానం కారణంగా పాత స్టాంపుల అమ్మకాలను నిలిపివేయడం అత్యంత దారుణమైన విషయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి అన్నారు. బుధవారం కావలి ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఆర్‌డిఒకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ పాత స్టాంపులు ఎంతో దృఢమైనవి, మన్నికైనవి సుమారు 100 సంవత్సరాలకుపైగా ఉండగలిగే స్టాంపులను అమ్మకుండా, దానిపై బతికే 25మంది స్టాంపు వెండర్లకు స్టాంపులు లేకుండా చేయడం, ఆ 25మంది కుటుంబసభ్యులను రోడ్డున పడవేయడం అన్యాయమని తెలిపారు.
ప్రజలు ప్రతీ విషయాన్ని పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలోనూ అఫిడవిట్‌ రూపంలో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. ఆ స్టాంపులు దృఢంగానూ మన్నికగా ఉండేవని తెలిపారు. ఆ స్టాంపులను ఎత్తివేసి ''జగనన్న సంస్కరణలో భాగంగా ఈ-స్టాంపింగ్‌ విధానం ప్రవేశపెట్టి ప్రతివిషయంలోనూ సంస్కరణల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతూ, ఆఫీసుల చుట్టూ తిప్పుతూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపులు విక్రయించకుండా, స్టాంపులు విక్రయించే మహిళ వచ్చిన వినియోగదారుల తోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. స్టాంపులకు కృతిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలను నానా విధాలుగా కష్టాలు పడుతున్నారని కావలి రిజిస్ట్రారు కార్యాలయంలో స్టాంపులు అమ్మే మహిళ దురుసు ప్రవర్తన వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముసలి సీనయ్య, పైడి విజరుకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.