Jun 30,2023 00:04

ఉచిత వైద్య శిబిరంలో మాట్లాడుతున్న డాక్టర్‌ వరుణ్‌

మంగళగిరి: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి, తాడేపల్లి సహకారంతో మంగళగిరి, తాడేపల్లి పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు విజయవాడ డాక్టర్‌ వరుణ్‌ కార్డియాక్‌ సైన్సెస్‌, డాక్టర్‌ గుంటూరు వరుణ్‌ సహకారంతో హృదయ సంబంధిత పరీక్షల కోసం ఉచిత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. మంగళగిరి ప్రెస్‌ క్లబ్‌ భవనంలో మంగళగిరి,తాడేపల్లి మండలానికి చెందిన పాత్రి కయులు ఈ క్యాంపునకు విచ్చేసి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వరుణ్‌ మాట్లాడుతూ తల్లీతండ్రీ పేరున ఉన్న రాధా లక్ష్మీ హార్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా వచ్చే సంవత్సరం, ఏప్రిల్‌ 1 నుంచి 10వ తేదీ వరకు వరకు సుమారు వెయ్యి స్తంట్లు అమర్చాలని, వచ్చే ఏడాదిలో 200 యాంజియోగ్రామ్‌ లను ఉచితంగా చేయాలని నిర్ణయిం చినట్లు చెప్పారు. అమ రావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేకరులకు రూ.12,000 విలు వైన వైద్య పరీక్షలను రూ.500కే చేసే సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్‌ మంగళగిరి అధ్యక్షులు త్రిపురమల్లు సతీష్‌ బాబు అధ్యక్షత వహించారు. తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి వివేకానంద రెడ్డి ,మంగళగిరి క్లబ్‌ ట్రైనర్‌ అనిల్‌ చక్రవర్తి, మాజీ ప్రెసిడెంట్‌ మాజేటి వంశీకృష్ణ, కోశాధికారి గాజుల శ్రీనివాసరావు, సెక్రెటరీ అందే మురళి , ప్రెసిడెంట్‌ అందే రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు.