ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: పాత్రికేయ రంగంలో 25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న కుర్ర వెంకటరామయ్యకు రోటరీ క్లబ్ మార్టూరు వారి ఆధ్వర్యంలో పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకల్లో భాగంగా కుర్ర వెంకటరామయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొర్రపాటి రాజారావు మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయుడు కుర్ర వెంకటరామయ్య 25 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల నక్కబొక్కలపాడు గ్రామంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన నేపథ్యంలో కళ్లజోళ్ళు అవసరమైన వారికి పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా 40 మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా యూత్ చైర్మన్ రవి అంకమ్మ చౌదరి, సెక్రెటరీ మద్దుమాల కోటేశ్వరరావు, చెరుకూరు నాగేశ్వరరావు, గ్రామపెద్దలు, వైద్యులు పాల్గొన్నారు.










