ప్రజాశక్తి-విజయనగరం కోట : సమాజానికి చుక్కానిగా వ్యవహరించే పాత్రికేయ వ్యవస్థ అత్యంత పవిత్రమై నదని సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎస్ఎన్రాజు మాట్లాడుతూ పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి సేవలు అందిస్తున్న అనకాపల్లికి చెందిన కాండ్రేగుల కళ్యాణ్ రామ్‌కు 2023 సంవత్సరానికి జాతీయ పత్రికా దినోత్సవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముందుగా సత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు జ్యోతి ప్రజ్వలనం చేశారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 200 మంది ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, పతకాలను ప్రదానం చేశారు. ఉత్తమబుక్ రీడర్స్ గా నిలిచిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాల యానికి చెందిన 20 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు,ప్రముఖ వైద్యులు డాక్టర్ సన్యాసమ్మ ,ట్రైబల్ యూనివర్సిటీ ఎఒ డాక్టర్ సూర్య నారాయణ, ఎం సుభద్రాదేవి పాల్గొన్నారు.