ప్రజాశక్తి-సంతమాగులూరు: పేదవారి సంక్షేమమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం మండలం లోని పాతమాగులూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు, అధికారులు, నాయకులతో కలిసి కాలనీలోని గడప గడపకూ వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనితీరును కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ముందుగా కాలనీవాసులు చైతన్యకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై ఎలమంద, వైసిపి మండల పార్టీ కన్వీనర్ చింతా రామారావు, గ్రామ పార్టీ కన్వీనర్ బి కృష్ణారెడ్డి, ఓబులరెడ్డి, జిర్రా విజయబాబు, కోటిరెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.










