Jul 10,2023 00:04

వినుకొండ: అభ్యుదయ కవి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కమలా రామ్‌ రచించిన గేయ సంపుటి 'పాటల పల్లకిలో' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆదివారం స్థానిక సిపిఎం ఆఫీస్‌ ఆవరణలో జరిగిన సభకు భాగవతుల రవికుమార్‌ అధ్యక్షత వహిం చారు. ముఖ్యఅతిథి పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. రవికుమార్‌ మాట్లాడుతూ కమలా రామ్‌ తాను నమ్మిన సిద్ధాం తాలను త్రికరణ శుద్ధిగా అనుసరిస్తూ ప్రజలను చైతన్య పరిచే అనేక అభ్యుదయ, భావ గీతాలు రాశారని చెప్పారు. ఆ గేయాల సంకలనమే ఈ పుస్తకమని చెప్పారు. జీవి ఆంజనేయులు మాట్లా డుతూ కమలారామ్‌ ఎన్నో సుమ ధుర గీతాలు రాసి, ఎన్నో సత్కారాలు పొందారని, సినీ గీతాలు కూడా రాయడం సంతోషకరమని అన్నారు. పుస్తక సమీక్ష చేసిన కవులు దుబ్బల దాసు, యతిశ్రీ, కెజె రమేష్‌ మాట్లాడుతూ కమలా రామ్‌ కవితలు చాలా సరళమైన భాషలో, ఆదర్శవంతమైన భావాలతో నిండి ఉన్నాయన్నారు. అనంతరం కమలారామ్‌ దంపతులను ఘనంగా సన్మానిం చారు. కార్య క్రమంలో జాన్‌ సుందర రావు, జి.శ్రీనివాస రావు, పివి సురేష్‌, జి.రమణ, డాక్టర్‌ ఎల్‌ ఎన్‌ రావు , గుమ్మడి, కూచి రామాంజనేయులు , యుటిఎఫ్‌ రవి, ఆర్టిస్టు ప్రసాద్‌, గోపాలుని మధు, భవాని శంకర్‌, సూరి,సాహిత్య అభిమానులు, కవులు పాల్గొన్నారు.