ప్రజాశక్తి-అనంతపురము స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం బోధనేతర సిబ్బంది పాడైపోయిన ఇనుప వస్తువులతో 10 భారీకేడ్స్‌ను రూపకల్పన చేశారు. వీటిని ఉపకులపతి జి.రంగజనార్ధన మెకానికల్ విభాగం వర్క్‌షాపులో బారికేడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ జెఎన్‌టియు ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ వర్క్‌షాపులోని పాత మెటీరియల్‌తో బారీకేడ్లను తయారు చేశారని వివరించారు. బారీకేడ్లను కళాశాలలోని వివిధ గేట్ల వద్ద ఉంచనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మెకానికల్ వర్క్‌షాపు ఇన్‌ఛార్జి, బోధనేతర సిబ్బందిని విసితోపాటు రెక్టార్ ఎం.విజయ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.దుర్గాప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ ఎస్‌వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ ఇ.అరుణకాంతి, భువనవిజయ, బి.చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతి, కళ్యాణి రాధా, మెకానికల్ వర్క్‌షాపు ఇన్‌ఛార్జి ఓంప్రకాష్, టి.బాలనరసయ్య, ఎస్.చంద్రమోహన్‌రెడ్డి, కె.ఎఫ్.భారతి, ఎం.రామశేఖరరెడ్డి, దిలీప్‌కుమార్, అజిత, సెక్యూరిటీ హెడ్స్ వెంకటేష్, ఖాసీం, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
భారీకేడ్లను ప్రారంభిస్తున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన










