ప్రజాశక్తి - పోలవరం
మండలంలోని పాత పట్టిసీమ పంచాయతీలో 64 నూతన పింఛన్లను లబ్ధిదారులకు పాత పట్టిసీమ సర్పంచి సబ్బారపు శ్రీరామ్మూర్తి, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.విజయ కుమారి, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, నూనకాని ధర్మేంద్ర, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










