నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
ప్రజాశక్తి- దేవనకొండ
జిపిఎస్, సిపిఎస్‌ను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రోషన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని తెర్నేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ కు బదులు జిపిఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని తెలిపారు. జిపిఎస్, సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.










