Sep 27,2023 22:47

ప్రజాశక్తి-అమలాపురం
జిపిఎస్‌ వద్దని పాత ఫంక్షన్‌ విధానమే కొనసా గించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా జిపిఎస్‌ బిల్లును బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడంపై అమలాపురం పట్టణం స్థానిక హైస్కూల్‌ సెంటర్లో యుటిఎఫ్‌ నాయకులు జిపిఎస్‌ బిల్లు ప్రతులను తగలబెట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి బసు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు సి పి ఎస్‌ ను వ్యతిరేకించి ఒపిఎస్‌ కోరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా జిపిఎస్‌ను ఆమోదించడంపై జిల్లా యుటిఎఫ్‌ శాఖ వ్యతిరేకిస్తుందని ఇది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చీకటి రోజు అని అన్నారు. వెంటనే ఈ జిపిఎస్‌ బిల్లును రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పెంకె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మురుగేశ్వరరావు, పెన్నాడ శ్రీనివాసరావు, ఉప్పలగుప్తం మండల శాఖ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం సురేష్‌ కుమార్‌ అమలాపురం రూరల్‌ మండలం అధ్యక్షులు శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ నాయకులు కృష్ణకుమారి, నాగ శ్రీదేవి, వసంత, బిఎన్‌.వెంకటే శ్వరరావు, ఏడుకొండలు, జివి.శ్రీనివాస్‌, బి.వేణుగోపాల్‌, జి.త్రినాథ్‌ కుమార్‌ ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు.