Nov 19,2023 23:30

ప్రమాణ స్వీకారం చేస్తున్న మండలశాఖ సభ్యులు

ప్రజాశక్తి- పొందూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిపిఎస్‌ విధానాన్ని అంగీకరించబోమని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ద రించాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కారద్యర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల-1లో ఎపిటిఎఫ్‌˜్‌ మండల శాఖ అధ్యక్షులు మొగదాల రమణరావు ఆధ్వర్యంలో ఆదివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఒ నెంబర్‌ 117ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మజ్జి మథన్మోహన్‌, జిల్లా కార్యదర్శులు డి.వీరయ్య, పి.లక్ష్మణరావు, ఎం.గంగేశ్వరి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.విజరుకుమార్‌, బొంతు అప్పలనాయుడు, జి.సిగడాం ప్రధాన కార్యదర్శి కిలారి వెంకటరమణ, దండా సూరిబాబు, పి.వి.నరసింహారావు, పి.వి.రమణారావు, దుంప రవికుమార్‌, కల్లూరు రంగారావు దుబాకుల శ్రీనివాసరావు, పప్పల రమణమూర్తి, పొన్నాడ అప్పారావు, లోలుగు వెంకటేష్‌, వి.వి.గోవిందరావు, పాసపు సత్యారావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..
మండలశాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మొదగాల రమణారావు, ప్రధాన కార్యదర్శిగా పొన్నాడ తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా దుంపల శ్రీనివాసరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, గుడిశా జవహార్‌గుప్తా, చింతాడ విజయబాల, కార్యదర్శులుగా రఘుపతి రఘువునాయుడు, దండా శ్రీనివాసరావు, పైడి రవిబాబు, వంబర శ్రీనివాసరావు, పొన్నాడ ద్రాక్షాయణిలను ఎన్నుకున్నారు.