Sep 23,2022 23:48

ఆందోళన చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి -ములగాడ : పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలని ఎన్‌సిఇయు ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్‌చేశారు. డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఈ నెల 26వ తేదీన చేపట్టే ధర్నాకు మద్దతుగా శుక్రవారం డాక్‌యార్డు గేటు వద్ద వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, పెన్షన్‌ పాలకుల భిక్ష కాదని, కార్మికుల హక్కు అని చెప్పారు. 2004 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన అందరికీ పాత పెన్షన్‌ స్కీమ్‌ వర్తింపజేయాలని డిమాండ్‌చేశారు.