Oct 29,2022 23:31

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందిస్తున్న నవోదయ పాఠశాల సిబ్బంది

ప్రజాశక్తి -పిఎం పాలెం : 2004 సంవత్సరానికి ముందు నియామకం పొంది జవహర్‌ నవోదయ విద్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బందికి పాత పెన్షన్‌, సిసిఎస్‌ 1972 సౌకర్యం అమలు చేయాలని కోరుతూ ప్రిన్సిపల్‌ సంజరు ఆధ్వర్యాన ఉద్యోగుల బృందం, నగర పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు అన్ని విభాగాలలో 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరిన సిబ్బందికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని, నవోదయ సిబ్బందికి మాత్రం ఈ సౌకర్యం కల్పించక పోవడం వలన నిరాశకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమలత, మహేష్‌, సత్యనారాయణ, శంకర్రావు, గణపతి పాల్గొన్నారు.