ప్రజాశక్తి - తిరువూరు
తాము సాగుచేసుకుంటున్న భూము లను రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మం జూరు చేయాలని గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేసినా అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేకపో వడంతో రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద దళితులు ఆందోళన చేశారు. ఎర్రమాడు గ్రామానికిచెందిన దళి తులు సిపిఎం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతపట్టి తిరువూరులోని ఆర్ డిఓ కార్యాలయం వద్ద పెద్దఎత్తున సోమవారం ధర్నా చేశారు. 30 ఏళ్ళ క్రితం తమ కు ప్రభుత్వం సీలింగ్ భూములు మంజూరు చేసి పట్టాలు ఇచ్చిందని, కానీ అప్పటినుండి తమ పేరుతో భూము లను రెవెన్యూ రికార్డులలో ఎక్కించలే దని ఆర్ డిఓకు దళితులు మొరపెట్టు కున్నారు. దీనివల్ల తమకు ప్రభుత్వం కల్పించే రాయితీలు, పథకాలు దక్క టం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మీరై నా తమకు న్యాయం చేయాలని ఆర్ డిఓకు, అనంతరం తహశీల్దార్ కు విన తిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాంబా రు వెంకటేశ్వర్లు, నాయకులు ప్రభాకర రావు, ఎస్వీ.భ ద్రం, బి.జె.సుందరరా వు, తాటికొండ వెంకటేశ్వర్లు, సిహెచ్. సురేష్, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరావు, గ్రామ పెద్దలు, కొత్తపల్లి నాగేశ్వరరావు, గంథం రామా రావు, కె.బాలసౌరి, దొడ్డా నానయ్య పాల్గొన్నారు.










