నారాయణమూర్తితో అధ్యాపకుడు రవికుమార్
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : మండలంలోని వైకెఎం కాలనీలో ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి సందడి చేశారు. సెప్టెంబర్‌లో తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యూనివర్సిటీ సినిమా రీరిలీజ్ ప్రమోషన్‌లో భాగంగా మజ్జిగౌరి కాలనీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ తెర్లి రవికుమార్ ఇంటికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ స్ధాయిలో పిజి విద్యార్ధులతో పాటు రాష్ట్రంలో విద్యారంగం సమస్యలపై నిర్మించిన తన యూనివర్సిటీ అనే సినిమాను విద్యార్థులు, బంధువులు మిత్రులంతా వీక్షించేలా ప్రోత్సహించాలని కోరారు. సామాజిక ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యలపై చిత్రాలు నిర్మిస్తున్న తనవంటి వారికి ప్రజలే ప్రోత్సాహం అందించాలని కోరారు.










