Jul 13,2023 21:54

వైస్‌ ఎంపిపిగా ఎన్నికైన రవికుమార్‌కు ధ్రువపత్రం అందజేస్తున్న పిఒ కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  పార్వతీపురం మండల రెండో వైస్‌ ఎంపిపిగా చినబొండపల్లి ఎంపిటిసి బంకురు రవికుమార్‌ ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి రవికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గడువులోగా ఎవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు పిఒ ప్రకటించారు. అనంతరం హాజరైన సభ్యుల సమక్షంలో వైస్‌ ఎంపిపిగా ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్‌.రమేష్‌, ఇఒపిఆర్‌డి ఎన్‌.కృష్ణుడు, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, ఎంపిపి మద్ది శోభారాణి, వైస్‌ ఎంపిపి సిద్ధా జగన్నాథరావు, నాయకులు పాల్గొన్నారు.