ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : టిడిపిని పార్వతీపురం నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త గడపతొక్కుతానని ఆపార్టీ ఇన్‌చార్జీ బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని తాళ్లబురిడిలో పర్యటించిన ఆయన ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం గ్రామంలోని టిడిపి నాయకుల ఇళ్లకు వెళ్లి టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, కష్టించిన కార్యకర్తలకు గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. శక్తివంచనలేకుండా కృషి చేసి, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, అందుకు తమ పూర్తి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొగ్గమోహనరావు, కార్యదర్శి బోను చంద్రమౌళి, అరకుపార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు, బేత లక్ష్మణరావు, మధుసూధనరావు బుడితిశ్రీరామ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.










