Feb 04,2022 17:31

న్యూఢిల్లీ : అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం.. పుష్ప. ఈ చిత్రంలోని పాటలకు ఫిదా అవ్వని వారంటే లేరు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు, సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు సాంగ్‌లకు డాన్స్‌లు చేస్తున్నారు. క్రికెటర్లు సైతం.. డైలాగులు, డాన్స్‌లు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ మేనియా రాజకీయాలకు తాకింది. పుష్పలోని శ్రీవల్లి సాంగ్‌ మ్యూజిక్‌ను కాంగ్రెస్‌ తన పార్టీ ప్రచారానికి వినియోగించుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ట్యూన్‌ వినియోగిస్తూ.. సాంగ్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ' తు హై గజబ్‌ యుపి, తేరీ కసమ్‌ యుపి' అంటూ ఈ సాంగ్‌ సాగుతోంది. ఈ పాటలో వీరుల గురించి ప్రస్తావించారు. నిమిషానికి పైగా ఉన్న ఈ సాంగ్‌ను ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

                                                                ఆ వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి