Sep 05,2023 00:17

ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు వైసిపి అద్దంకి ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందించటమే ద్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎవరికైన అందకపోతే అధికారులను సంప్రదించాలని కోరారు. అవ్వ, తాతలకు ఇంటికి వెళ్లి ఒకటో తేదీనే పెన్షన్ ఇప్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. నూతనంగా మంజూరైన 151 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. మండలంలో 7793మందికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ, ఏపీఎం సురేంద్రబాబు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, సర్పంచులు ధూళిపాళ్ళ బులిరామయ్య, పసల అంజలి నాగేశ్వరరావు, బండారు వెంకాయమ్మ, గురవయ్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ శ్రీనువలి, నాయకులు కె శంకరరెడ్డి, మేడ శివదుర్గ, దివి రామాంజనేయులు పాల్గొన్నారు.