మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి-మాకవరపాలెం:పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తెలిపారు. గురువారం మాకవరపాలెంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే స్థానిక సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు, ఎంపీటీసీ సర్వం, ఎంపీడీవో అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.










