Jun 11,2023 00:24

ధర్మశ్రీకి తిలకం దిద్దుతున్న మహిళలు

ప్రజాశక్తి-రోలుగుంట:అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శనివారం రోలుగుంట మండలం రొంగలిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ, అర్హతే ప్రామాణికంగా రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకా లను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యర్రంశెట్టి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.