Apr 18,2023 00:39

ఎంఎల్‌ఎ కరణం ధర్మశ్రీ


ప్రజాశక్తి -కొత్తకోట:పార్టీలకు అతీతంగా అర్హత వున్నవారందరికి సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, చోడవరం ఎంఎల్‌ఎ కరణం ధర్మశ్రీ అన్నారు. కొత్తకోట సచివాలయం 3 పరిధిలో గోడగలవీది, బీమరాతివీధి, మట్టా వీధి, గొల్ల వీధి లలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వపధకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మట్టా వీధిలో డ్రైన్లు, కొళాయిలు వేయా లని, గోడగలవీధిలో కాలనీ ఇల్లులు మంజూరు చేయాలని ఎంఎల్‌ఎకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పైల రాజు, తహసీల్దార్‌ మహేశ్వర రావు, ఎంపిడిఓ వెంకన్న బాబు, వైసిపి మండల కన్వీనర్‌ జగన్నాధరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ సత్యదేవ, సర్పంచ్‌ లోవరాజు, ఉప సర్పంచ్‌ దేవా, ఎంపిటిసి పూడి దేవ, పైల చిన్నమ్మలు, వైసీపీ నాయకులు తలారి ఆదిమూరి, శీలం శంకరరావు పాల్గొన్నారు.