ప్రజాశక్తి-పాయకరావుపేటcర్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ప్రభుత్వంపై మాయమాటలతో దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మితే పేద ప్రజలు మోసపోయి పథకాలకు దూరమైపోతారన్నారు. మండల కేంద్రంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అధ్యక్షతన నియోజకవర్గం విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని వివరించాలన్నారు. పార్టీలో మనస్పర్థలను పక్కన పెట్టి పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే గొల్ల బాబూరావును గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ బి.సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, చెంగల వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ డివీ సూర్యనారాయణరాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గూటూరు శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షులు బాబురావు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, ఎంపీపీ పార్వతి తాతారావు, సర్పంచ్ గారా ఉష శ్రీ ప్రసాద్, నియోజవర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు పాల్గొన్నారు.
సుబ్బారెడ్డిని కలిసిన ఎంపిటిసిలు
కోటవురట్ల:ఎంపిటిసి రాంబాబు, బికేపల్లి ఎంపీటీసీ సభ్యులు వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మండలంలో సమస్యలతో పాటు గ్రామీణ ప్రాంత ఆలయాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.










