Oct 17,2023 22:44

సమావేశంలో మాట్లాడుతున్న కృపాలక్ష్మి

ప్రజాశక్తి-కార్వేటినగరం: పార్టీ గెలుపుకు గృహ సారధులే పట్టుకొమ్మలు అని డిప్యూటి సిఎం నారా యణస్వామి కుమారై కృపాలక్ష్మి అన్నారు. మం గళవారం మండల కేంద్రంలోని ఓ కళ్యాణ మండ లంలో కన్వీనర్లు, గృహసారధులు, పార్టీ శ్రేణు లతో ఎంపిపి లతబాలాజి ఆధ్వర్యంలో సమావేశం నిర్వ హించారు. కృపాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం అమ లు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించా లన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచే యాలని పిలుపునిచ్చారు. మ్యాని ఫెస్టోలోని హామీ ల్లో 99శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన న్నే అన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అనుసరిం చాల్సిన విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. జిడి నెల్లూరులో ఎన్నడూ లేని అభివృద్ధిని వివరించారు. కార్యక్రమ ంలో వైసిపి నాయకులు శేఖర్‌ రాజు, ధనంజయ వర్మ, కార్తీక్‌, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలో మంగళవారం వైసిపి కన్వీనర్‌ పూర్ణచంద్రారెడ్డి అధ్యక్షతన పార్టీ శ్రేణలతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతిఒక్కరూ కష్టపడాలని సూచించారు. పలువురు బాధితులకు సీఎం సహాయ నిధి రూ.27లక్షల చెక్కును అందజేశారు. నాయకులు గుణశేఖర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.