ప్రజాశక్తి - చిప్పగిరి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సలహాల మేరకు వైసిపి అభివృద్ధికి మరింత బాధ్యతతో పని చేస్తానని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న గుమ్మనూరు నారాయణ తెలిపారు. మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా నియమితులైన గుమ్మనూరు నారాయణను బుధవారం ఎంపిడిఒ సుధాకర్ రాజు ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరి సహకారం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు. మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. వైసిపి అభివృద్ధికి చేసిన కృషి వల్ల నేడు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి దక్కిందన్నారు. మంత్రి జయరాం సహకారంతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఇఒఆర్‌డి సంజన్న, ఎపిఒ మాధవ శంకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు బాలన్న, నాగభూషణం, సిసింద్రీ, నరేంద్ర, జయరాం నాయక్, సుధీర్, సురేంద్ర, నరసింహులు, రామాంజిని పాల్గొన్నారు.
గుమ్మనూరు నారాయణ సన్మానిస్తున్న మండల కార్యాలయ సిబ్బంది










