పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా
వైసిపి ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షులు సగినేల వెంకటరమణ
ప్రజాశక్తి - పగిడ్యాల
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి శక్తి వంచన మేరకు కృషి చేస్తానని వైసిపి ఎస్‌సి సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు సగినేల వెంకటరమణ అన్నారు. ఆదివారం పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువ శ్రామిక, రైతు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవ చేస్తునందుకు గుర్తించి నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పజెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను, నవరత్నాలను అర్హులైన వారందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. కుల, మత, ప్రాంతం, పార్టీలు అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాల అందించాలని, జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అనే నినాదంతో ఎమ్మెల్యే ఆర్థర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. సిఎం జగనన్న, ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విద్య దీవెన, వసతి దీవెన, రైతు భరోస, వైఎస్‌ఆర్ చేయూత, పొదుపు మహిళలకు సున్నా వడ్డీ, పింఛన్లు పెంపు వంటి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించాలని, ప్రజల వద్దకే పాలన అంటూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి నూతన వ్యవస్థకు నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను జగనన్న ఏర్పాటు చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించాడానికి కృషి చేస్తానన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు రాజు, సుబ్బన్న, మసీదుల సుభాన్, వెంకటేశ్వర్లు, రామసుబ్బరెడ్డి, రామకృష్ణ, రాముడు, అంకన్న, రమణ, రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు.










