పార్క్ ను సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే
పార్కుల ఆధునీకరణకు చర్యలు : కమిషనర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన 9 పార్కులను, 2 మినీ పార్కుల ఆధునీకరణకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ సమీపంలోని పార్క్‌ను కమిషనర్‌తో పాటు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పార్క్ అభివృద్ధికి రూ.15 లక్షల అంచనాలను రూపొందించి త్వరలో టెండర్ల ద్వార పనులు ప్రారంభం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తమీమ్, వైసిపి నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










