పార్కులో ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న కమిషనర్
ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో మున్సిపల్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పార్కులోని ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని మహావీర్ పార్కు, ఇంద్ర నగర్, రాంజల చిల్డ్రన్స్ పార్కు, నేషనల్ స్కూల్ పార్కు, ఎన్‌జిఒస్ కాలనీ పార్కు, ఎస్‌కెడి కాలనీ పార్కుల్లో కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. విరివిగా మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా మారుస్తున్నామన్నారు. వాకింగ్, జాగింగ్ చేసేందుకు అవసరమైన సదుపాయాల కల్పనకు రూ.5 లక్షలతో ఒక్కో పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.










