Jun 17,2023 00:21

పార్కును ప్రారంభిస్తున్న మేయర్‌ గొలగాని, ఎమ్మెల్యే అదీప్‌ రాజు

ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 95వ వార్డు పరిధి ఎన్‌ఎడి లే-అవుట్‌, ఎల్‌ఎన్‌.నగర్‌లో రూ.82.20 లక్షలతో నిర్మించిన పార్కును మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ హరివెంకటకుమారి మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలోని 98 వార్డులు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సలహాలు, సూచనల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ, విలీన గ్రామాల అభివృద్ధికి మేయర్‌ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్‌ ముమ్మన దేముడు, జోన్‌ -8 కమిషనర్‌ ఎమ్‌ఎమ్‌ నాయుడు, హార్టీకల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎమ్‌.దామోదర్‌, జివిఎంసి ఎఇ ఎ.నర్సింహమూర్తి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, సొసైటీ ప్రతినిధులు అత్తిలి నాగేంద్రకుమార్‌, సన్యాసిరావు, సత్యనారాయణ, పాపారావు, చంద్రరాజు, లత, అనిత, అధికారులు, ఆర్‌పిలు వాలంటీర్లు పాల్గొన్నారు.