
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే , ఎమ్మెల్సి తదితరులు
మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెనుక వైపు ఉన్న సికె గర్ల్స్ హై స్కూల్ స్థలంలో అర ఎకరం విస్తీ ర్ణంలో పార్కింగ్ ఏర్పాటుకు మధ్యలో గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. దేవస్థానానికి వచ్చే యాత్రి కులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సి మురుగుడు హనుమంత రావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, దేవస్థానం ఆలయ ఈవో ఎ.రామకోటిరెడ్డి పాల్గొన్నారు.