పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పట్టణ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యుల సేద తీర్చుకునే లా అన్ని సౌకర్యాలతో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఆటోనగర్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద 24 లక్షల రూపాయల వ్యయంతో నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుందరమైన పార్కును ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణ కల్పించేందుకు పలు పార్కులను ఇప్పటికే అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం ఎంట్రెన్స్ ఆటోనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అత్యంత సుందరంగా 24 లక్షల రూపాయలతో పార్కు ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి ఈ పార్కును స్థానిక ప్రాంతవాసులకు అంకితం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు, జాకీర్, జాకీర్ హుస్సేన్, బాషిద్, వైఎస్ఆర్సిపి నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తిక్కా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










