
జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణిి
ప్రజాశక్తి -నక్కపల్లి :మండలంలోని ఉద్దండపురం సిహెచ్‌బి అగ్రహారంలో జరుగుతున్న గ్రామ కంఠం సర్వేను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి పరిశీలించారు. గ్రామ కంఠంలో ఉన్న ఇల్లు, ఖాళీ నివేసిన స్థలాలు, ఇతర నిర్మాణ వివరాలను పక్కగా నమోదు చేయాలని సూచించారు. మ్యాప్‌ను పరిశీలించారు. సకాలంలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. ఉద్దండపురంలో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి సంపద తయారీ కేంద్రానికి తరలించి, చెత్త రహిత గ్రామంగా తీర్చి దిద్దాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వెంకట నారాయణ పాల్గొన్నారు.