ప్రజాశక్తి - వేటపాలెం
గ్రామాల్లో పారిశుద్ధంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చింతల రుతమ్మ అన్నారు. మండలంలోని కొత్తపేట, పాపాయిపాలెం పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్, సున్నం నిల్వలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రజారోగ్యంపై ఎలాంటి అలసత్వం వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాపాయిపాలెం, కొత్తపేట గ్రామాలలోని చెత్త నుండి సంపద కేంద్రాలను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీవో ఆఫీస్ సూపర్డెంట్ ఎంవిఎస్ శర్మ ఉన్నారు










