Jul 18,2023 17:06

మురికి నీటిలో ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు

పారిశుధ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : టిడిపి

ప్రజాశక్తి - చాగలమర్రి

చాగలమరి మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్యం పడకేసిందని, పాలకులు,అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని టిడిపి రాష్ట్ర రాష్ట్ర మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షులు అన్సర్‌ బాషా విమర్శి ంచారు. మంగళవారం చాగలమరి పట్టణంలోని ముత్యాలపాడు బస్టాండ్‌ లో గత వారం రోజులుగా రోడ్డుపై ప్రవహిస్తున్న మురికినీటిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పాలకులు గానీ అధికారులు గాని గత వారం రోజుల నుండి ప్రధాన రహదారిలో నీళ్లు నిలిచి కంపు కొడుతున్న పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. అహౌబిలం కు వెళ్లే ప్రధాన రహదారి అయిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థులు, ప్రజలు ముక్కులు మూసుకుని వెళ్లవలసిన దౌర్భాగ్యస్థితి నెలుకుందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసిం హులు, నంద్యాల జిల్లా బీసీ సెల్‌ స్పోక్‌ పర్సన్‌ సల్లా నాగరాజు, టిడిపి నాయకులు హనీఫ్‌, మాబు లాల్‌, బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మీనా రాయణ గౌడ్‌ రామతీర్థం,గఫార్‌, షాబుల్‌, జెట్టి నాగరాజు, మౌలాలి నాగూర్‌, ఖాజా రసూల్‌,షరీఫ్‌, మధు, కామిశెట్టి రమేష్‌ గఫార్‌, అజీమ్‌, నూర్‌ భాష,షబ్బీర్‌, రాజేష్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.