Dec 13,2022 23:59

మాట్లాడుతున్న ఈఓపిఆర్‌డి

ప్రజాశక్తి -నక్కపల్లి:గ్రామాల్లో పారుశుధ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఈఓపిఆర్‌డి పి. వెంకటనారాయణ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, ముందస్తు చర్యల్లో భాగంగా శానిటేషన్‌ చేయించాలన్నారు. మురుగు కాలువల్లో నీరు నిలువ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించాలన్నారు. దోమలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇండ్ల వద్ద మురుగునీరు నిల్వ లేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి 31 నాటికి 100 శాతం ఇంటి పన్ను వసూలు అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.