Mar 17,2023 23:41

వినతిపత్రం ఇస్తున్న కౌన్సిలర్‌ సౌజన్య

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మున్సిపాలిటీలో పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని 9వ వార్డు జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్యం అధ్వాన్నంగా ఉందన్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్‌ చేయలేదన్నారు. ఏడాదికి సుమారు 8 కోట్ల పన్నులు రూపంలో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా సమస్యలను పరిష్కరించ లేదన్నారు. మున్సిపాలిటీలో పందులు, కుక్కల సమస్య తీవ్రంగా ఉందన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు.