పొన్నూరు రూరల్: పొన్నూరు మున్సిపల్ పరిధిలోని సోమవారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగినది దీనిలో భాగంగా సచివాలయం 11 వార్డులు 20,22 రావు గారి బజారు, ముబారక్ నగర్, కమ్యూనిటీ హాల్ బజారు, వాటి అనుబంధ బజారులలో మురుగు కాలువల పూడిక తీతలు, పిచ్చి మొక్కలు తొలగించారు. మురుగు కాల్వల్లో దోమల మందును చల్లించారు. ఈ సంద ర్భంగా కమిషనర్ నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ గృహ యజమానులు రోడ్లపై చెత్త వేయొద్దని, మున్సి పల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించి పట్టణ పారి శుధ్యానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.










