Apr 22,2023 23:15

వ్యర్థపదార్థాల నిర్వహణా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ మహేష్‌కుమార్‌


ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ రావిరాల శనివారం పారిశుధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదిత్య కళాశాల- డి మార్ట్‌ ప్రాంతాల మీదుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అక్కడే ఉన్న నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్‌ పృధ్వీ చరణ్‌ కు సూచనలు ఇచ్చారు. అక్కడి నుంచి వెహికల్‌ యార్డ్‌ ను సందర్శించారు. పర్యటనలో భాగంగా ఘన, వ్యర్ధ పదార్థాల నిర్వహణా కేంద్రాన్ని కమిషనర్‌ డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ రావిరాల పరిశీలించారు. ఎన్విరాన్‌ ఎకో మేనేజ్మెంట్‌ సంస్థ ద్వారా పొడి చెత్త ను ప్రాసెసింగ్‌ ప్రక్రియ చేస్తున్నట్లు డిఈ మాధవి వివరించారు. అలాగే తడి చెత్త ద్వారా ఆర్గానిక్‌ కంపోస్ట్‌ తయారు చేస్తున్నట్లు కమిషనర్‌ కు తెలియజేశారు.. వీటి నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.