ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురానికి చెందిన మాజీ సర్పంచి, కీర్తిశేషులు గుణ్ణం రామచంద్రరావు తనయుడు సురేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, యువకులు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సర్పంచి దిడ్ల అలకనంద తెలిపారు. బుధవారం సురేష్(రిషి) జన్మదినోత్సవం సందర్భంగా నారాయణపురం పంచాయతీ పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు అందజేశారు. చేబ్రోలు, ఉంగుటూరులో అనాధ శరణాలయంలో చిన్నారులకు అన్నసమారాధన నిర్వహించారు. చేబ్రోలు పిహెచ్‌సిలో వైద్యులు కెఎస్ సుబ్బరాజు వర్మ పర్యవేక్షణలో కేకు కోసి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు అభిమానులు వెజ్జు సుబ్బారావు, నల్లా ఆనంద్, గాది రమణ, యలమాటి ప్రసాద్, సీపాని రమేష్, పూడి రామకృష్ణ, గోలి బాలాజీ, కిలపర్తిదుర్గ, అగస్తి ప్రసాద్, ఎస్‌ఎస్, జివి మోటార్స్ స్టాఫ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










