Aug 09,2022 23:01

నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి -పిఎం.పాలెం: అభివద్ధి చెందుతున్న విశాఖలో నివాస ప్రాంతాలు, ప్రజలు విపరీతంగా పెరుగుతున్నా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచకుండా ఉన్న వారిపైనే పెంచుతున్న ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్‌చేస్తూ జివిఎంసి 6వ వార్డు పరిధి మధురవాడలో సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ, రోజూ చేసే పనితోపాటు అదనంగా స్కానింగ్‌ పని అప్పగించడం అపాలన్నారు. ఇప్పటికే కార్మికులు సరిపడా లేక పనిభారంతో ఇబ్బందులు పడుతున్న వారికి స్కానింగ్‌ పని కూడా అప్పగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.కిరణ్‌, ఎం.జాన్‌, బి.రాంబాబు, సిహెచ్‌.శ్రీను, కె.అచ్చియ్యమ్మ, డి.వరలక్ష్మి, పప్పి తదితరులు పాల్గొన్నారు.