Nov 03,2023 19:54

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులను పర్మినెంట్‌ చేయాలని సిఐటియు పట్టణ గౌరవ అధ్యక్షులు పి.సూర్యరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు స్థానిక ఆర్‌డిఒ ఆఫీస్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే మున్సిపల్‌ కార్మికులను ఆఫ్కాస్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒ సోమేశ్వరరావుకి వినతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి షేక్‌ సుభాషిని, పారిశుధ్య కార్మిక యూనియన్‌ కార్యదర్శి కొత్తూరు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.