Oct 07,2023 21:49

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
            తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వా సుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరుతూ ఎపి మెడికల్‌ ఎంప్లాయిస్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అరుణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మెడికల్‌ ఎంప్లాయిస్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ 40 పడకలుగా ఉన్న తణుకు ఏరియా హాస్పిటల్‌ను 150 పడకలకు పెంచుతూ జిల్లా కేంద్ర ఆసుపత్రిగా విస్తరించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా అనేక నూతన భవనాలు నిర్మించినప్పటికీ 40 పడకలుగా ఉన్నప్పటి ఏరియా హాస్పిటల్‌ స్థాయికి అనుగణంగా అప్పట్లో నియమించిన 18 మంది కార్మికులతోనే పారిశుధ్య పనులు చేయిస్తున్నా రన్నారు. 150 పడకల హాస్పిటల్‌ స్థాయికి అనుగణంగా పారిశుధ్య పనుల నిర్వహణకు 120 మంది కార్మికులను నియమించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ ఎంప్లాయిస్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వి.సూరమ్మ, టి.భారతి, పి.రేణుక, ఎం.బేబి, వెంకటరత్నం, డి.లక్ష్మణరావు పాల్గొన్నారు.