Aug 02,2023 16:36

జడ్పిటిసి, ఎంపీడీవోకు వినతి పత్రం ఇస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం

పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలి
పెండింగ్ వేతనాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలి .. సిఐటియు
ప్రజాశక్తి  - కొత్తపల్లి

      గ్రామాల్లో ఉన్న మురుగు చెత్తను ప్రతిరోజు శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న స్వచ్ఛభారత్ గ్రామీణ పారిశుధ్య కార్మికులకు  పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం పారిశుద్ధ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు స్వాములు డిమాండ్ చేశారు. బుధవారం  కొత్తపల్లి లో ఎంపీడీవో మేరీ  జడ్పిటిసి సుధాకర్ రెడ్డి కి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల నెల గ్రామపంచాయతీ నిధుల నుండి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం జీవోలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు అన్నారు. 15 నెలలుగా వేతనాలు అందకపోతే కార్మికులు కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.  పారిశుద్ధ కార్మికులు ట్రై సైకిళ్లు సైతం మరమ్మతులకు గురైతే సొంత ఖర్చులతో బాగు చేయించుకోవాల్సి వస్తుంది అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలైన బ్లౌజులు బూట్లు మాస్కులు సబ్బులు నూనెలు శానిటైజర్ వస్తువులు ఇవ్వకుంటే వాళ్లు ఏ విధంగా పని చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అమలు జరిపి 15 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను 15 ఆర్థిక సంఘం నిధుల నుండి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రైసైకిల్లా రిపేరీ ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని రక్షణ పరికరాల్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు గ్రీన్ అంబాసిడర్లు రాజారావు రవి మల్లేష్ తిరుపాలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.