Jun 30,2023 23:10

తాడేపల్లి: పట్టణంలో పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మి కుల సంఖ్యను పెంచాలని, దీని వల్ల ప్రస్తుత పారిశుధ్య కార్మికులపై పని భారం తగ్గించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని కృష్ణుని గుడి వద్ద పారిశుధ్య కార్మికుల గ్రూపు మీటింగ్‌ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ మూడు అకౌంట్లుగా ఉన్న కార్మికుల పిఎఫ్‌ను ఒకే అకౌంట్‌గా మార్చాలన్నారు. నులకపేటలో జరిగిన సమావేశంలో సిఐటియు నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితులకు కార్మికులు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.వెంగమ్మ, జి.కొండయ్య, ఎం.కామాక్షి, కె.సియోన్‌, సతీష్‌, శ్రీను, సంతోషం, రాంబాబు, అనూష, లక్ష్మీ, నాని తదితరులు పాల్గొన్నారు.